Devotional

గురుపౌర్ణమి… వ్యాస పౌర్ణమి అని ఎందుకు పిలుస్తామో తెలుసా..!!

గురు బ్రహ్మ గురుర్ విష్ణు… గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పర బ్రహ్మ… తస్మై శ్రీ గురవే నమః అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు. గురువు సాక్షాత్ పరబ్రహ్మ. అటువంటి గురువుకు నమస్కరిస్తున్నాను అని ఈ సంస్కృత శ్లోకం అర్ధం. గురు పౌర్ణమి సందర్భంగా గురువులందరికీ నమస్కారములు.
ప్రతి ఏటా ఆషాడ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమి ని “గురు పౌర్ణమి” గా జరుపుకుంటాం. వేద‌వ్యాసునిగా పిలువ‌బ‌డే కృష్ణద్వైపాయుని పుట్టిన‌రోజే ఈ గురుపౌర్ణ‌మి. త్రిమూర్తి స్వరుపులకు మహాగురువు వేద వ్యాసుడు.. హైంద‌వుల‌కి ఎంతో పూజ‌నీయ‌మైన‌ భారతం, భాగవతాల‌తో పాటు అష్టాదశపురాణాలు రచించిన‌వాడు వ్యాసుడు. అంతేకాదు. అప్ప‌టివ‌ర‌కూ ఉన్న వేద‌విజ్ఞానాన్ని నాలుగు భాగాలుగా విభ‌జించినవాడు. అందుకే ఆయ‌న‌కు వేద‌వ్యాసుడు అన్న పేరు వ‌చ్చింది.ఇలా మన కలియుగం లోని వారందరికీ వేద వ్యాసుడు తోలి గురువయ్యారు. అందుకే ఈరోజుని “వ్యాస పౌర్ణమి” గా పిలుస్తాం. జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులని పూజిస్తాం.

Comment here