Local news

గుంటూరులో భారీ అగ్నిప్రమాదం

గుంటూరుజిల్లా పెదకాకాని వాసవీనగర్ కాటన్ గోడౌన్లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో నిల్వ ఉన్న వేలాది పత్తి బేళ్లు దగ్ధమయ్యాయి. దాదాపు 5, 6 వేల పత్తిబేళ్లు దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో దాదాపు 12 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లుగా భావిస్తున్నారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని 7 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. పక్కన ఉన్న మిగతా బ్లాకులకు మంటలు వ్యాపించకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Comment here