ఓలేరులో గ్రామదర్శిని-గ్రామ వికాసం

భట్టిప్రోలు మండలం ఓలేరు గ్రామంలో బుధవారం మంత్రి నక్కా ఆనందబాబు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఓలేరు గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు, 14లక్షలతో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి నక్కా ఆనందబాబు ప్రారంభించారు. అనంతరం గ్రామదర్శిని-గ్రామవికాసం కార్యక్రమంలో భాగంగా ఓలేరు గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయన్నారు. రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కష్ట పడుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ముమ్మనేని వెంకటసుబ్బయ్య, దేవినేని మల్లికార్జున, ఓలేరు గ్రామ ప్రెసిడెంట్ వేములపల్లి చెంచయ్య, టీడీపీ నాయకుడు వేములపల్లి సత్యం తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here