Local news

“జ్ఞానభేరి” ని ప్రారంభించిన సిఎం చంద్రబాబు

తిరుపతి తారకరామ మైదానంలో “జ్ఞానభేరి” కార్యక్రమాన్ని సిఎం చంద్రబాబు ప్రారంభించారు.చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ యువత, విద్యార్థుల చేతుల్లోనే ఉందని అన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ప్రపంచంలోనే ఇంగ్లీషు మాట్లాడే దేశం ఇండియా అని, ఐటీ వల్ల ప్రపంచం గ్లోబల్ విలేజ్ గా మారిందని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయులే ఉన్నారన్నారు.2020 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని అన్నారు.ఏ దేశానికీ లేని అనుకూలతలు భారత్ కు, ఆంధ్రప్రదేశ్ కు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. మనం ఉద్యోగాలు చేయడం కాదని, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా పోటీతత్వం పెంచే లక్ష్యంతోనే “జ్ఞానభేరి” నిర్వహిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. సెల్ ఫోన్ తోనే అన్ని ప్రభుత్వ సేవలు పొందే రోజులు రాబోతున్నాయని, అన్ని రంగాల్లో సరికొత్త ఆవిష్కరణల ద్వారా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణంపై లఘు చిత్రాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను అలరించాయి.

Comment here