Cinema

సంజు నిర్మాతలకు అబు సలెం నోటీసులు

సంజూ’ సినిమాపై గ్యాంగ్‌స్టర్‌ అబు సలెం ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ చిత్రంలో తనను తప్పుగా చూపించారని ఆరోపించాడు. అంతేగాక.. సంజూ నిర్మాతలకు లీగల్‌ నోటీసులు కూడా పంపాడు. ‘సంజూ’ సినిమాలో సంజయ్‌దత్‌ వ్యక్తిగత జీవతం, ఆయన మాదకద్రవ్యాలకు బానిసవడం, అక్రమ ఆయుధాలు కలిగున్న కేసులో జైలుకెళ్లడం లాంటివి చూపించారు. ప్రస్తుతం జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ అబు సలెం.. సంజయ్‌దత్‌కు ఆయుధాలను అక్రమంగా సరఫరా చేసినట్లు సినిమాలో చూపించారు. అయితే సినిమాలో చెప్పిందంతా నిజం కాదని, తానేప్పుడూ సంజయ్‌దత్‌ను కలవలేదని, ఆయనకు ఆయుధాలు ఇవ్వలేదని అబుసలెం ఆరోపిస్తున్నాడు.

Comment here