Local news

నిండుకుండలా శ్రీశైలం జలాశయం – కొనసాగుతున్న వరదనీరు

ఎగువ నుండి వస్తున్న వరదనీటి ప్రవాహంతో శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. జలాశయానికి భారీగా వరదనీరు వస్తోంది. 1.6 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో అవుతుంది. జలాశయం నీటిమట్టం 885 అడుగులకు గానుప్రస్తుతం 867 అడుగులకు చేరింది.ఇంకా చాలా ఖాళీ ఉండటం వలన బయటకు నీరు ఏమీ వదలటంలేదు.జలాశయం పూర్తి స్ధాయి నిల్వ సామర్ధ్యం 215టీఎంసీలు కాగా ప్రస్తుతం 133 టీఎంసీలుగా ఉంది. పోతిరెడ్డిపాడుకు 12 వేల క్యూసెక్కులు, హంద్రీ నీవా కు 1013 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు….KS

Comment here