జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం…

హైదరాబాద్ నగర శివారులోని జీడిమెట్ల సుభాష్ నగర్ లో రెండు ఫాక్టరీలు మంటల్లో చిక్కుకుని స్థానికులను కలవార పాటుకు గురిచేశాయి.
మొదట అట్టల ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి… అనంతరం పక్కనే ఉన్న ఫ్యాన్ల కంపెనీకి వ్యాపించాయి.. మంటలను గమనించిన స్థానికులు ఫైర్‌ సిబ్బందికి ఫోన్‌ చేశారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకి చేరుకొనే లోగా ఫాక్టరీలను మంటలు చుట్టుముట్టాయి. మంటలను అదుపు చేయడానికి ఫైర్‌ సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చింది..

అర్థరాత్రి అగ్నిప్రమాదంతో చుట్టుపక్కల జనం భయాందోళనలకు గురైయ్యారు. ప్రమాదం జరిగిన ఫ్యాన్ల కంపెనీ పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌ వాసులు ఈ ఘటనపై స్పందిస్తూ… జనావాసాల మధ్య ఫ్యాక్టరీలతో నిత్యం నరకం అనుభవిస్తున్నామని.. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మరింత భయం వేస్తుందని… కనుక ఈ ఫ్యాక్టరీలను మరో ప్రాంతానికి తరలించాలని ఎన్నిసార్లు ఆందోళన చేసినా ఫలితం లేదని వాపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here