మెక్సికోపై విజయంతో క్వార్టర్‌ ఫైనల్‌కు బ్రెజిల్‌…

ప్రపంచ సాకర్‌ సమరంలో నిన్న జరిగిన మెక్సికోతో మ్యాచ్‌ జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది బ్రెజిల్‌ టీమ్‌. నెయిమార్‌ ఒక గోల్‌ను సాధించాడు. మెక్సికో తన మొదటిమ్యాచ్‌లోనే గత ప్రపంచ కప్‌ విజేత జర్మనీని మట్టికరిపించి సంచలనం సృష్టించినప్పటికీ ఆ తర్వాత తన ఆటతీరును కొనసాగించలేకపోయింది. ఆట ప్రధమార్ధంలో బాగానే ఆడినప్పటికీ ఆ పట్టును మెక్సికో ఆట చివరిలో పట్టు కోల్పోయింది. ఇరు జట్లు ఆట ప్రధమార్ధంలో చాలా అవకాశాలను సృష్టించుకున్నప్పటికీ ఇద్దరి డిఫెన్స్‌ అత్యుత్తమంగా ఉండడంతో ఇరు జట్లు కూడా గోల్‌ను సాధించలేకపోయాయి. ద్వితీయార్ధంలో 51వ నిమిషంలో మొదటి గోల్‌ను సాధించిన నెయిమార్‌, రెండవ గోల్‌ను రాబర్టో ఫిర్మినోకు అందివ్వడం ద్వారా ఆట చివరి వరకు పట్టు వదలకుండా నడిపించాడు. బ్రెజిల్‌ తన తరువాతి క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో బెల్జియంతో తలపడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here