టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ గురువారం ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంగా మొదటిరోజు ఆట రద్దయ్యింది. రెండోరోజైన శుక్రవారం అంపైర్లు ఆటకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. శిఖర్ ధావన్ బదులు, పూజారాను, ఉమేష్ యాదవ్ బదులు, కుల్దీప్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకున్నారు. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. మళ్లీ వర్షం పడటంతో ఆటను ఆపివేశారు. ఆట ఆగే సమయానికి భారత్ 6.3 ఓవర్లలో 11 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది.జేమ్స్ ఆండర్సన్ 2 వికెట్లు తీసాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here