ఇంగ్లండ్ దే విజయం

ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన మొదటి టెస్టు, ఓవరాల్ గా 1000వ టెస్ట్ అయిన మ్యాచ్లో ఇద్దరిమధ్య దోబూచులాడిన విజయం చివరకు ఇంగ్లండ్ నే వరించింది. ఇండియా పై 31 పరుగుల తేడాతో 1000వ టెస్టులో చారిత్రాత్మక విజయం సాధించారు.4వ రోజు 110/5 తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియాను ఆండర్సన్, దినేష్ కార్తీక్ ను ఔట్ చేసి ఇండియాను దెబ్బకొట్టాడు.అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య కోహ్లీతో కలసి నిలకడగా ఆడుతుంటే విజయం ఇండియాదేనని అందరూ భావించారు. కానీ అప్పుడే బౌలింగ్ కు వచ్చిన బెన్ స్ట్రోక్స్ విరాట్ కోహ్లీ(51) ని ఎల్బీడబ్య్లు గా ఔట్ చేయటంతో ఆట ఇంగ్లండ్ వైపు మొగ్గింది. అదే ఓవర్ చివరి బంతికి షమీ(0) ని కూడా స్ట్రోక్స్ ఔట్ చేసాడు. తరువాత కొద్దిసేపు హార్దిక్ ఆశలు కలిగించినా అధి ఎంతోసేపు నిలవలేదు.ఇషాంత్(11) ను 9వ వికెట్టుగా, హార్దిక్ పాండ్యా(31) ను బెన్ స్ట్రోక్ ఔట్ చేయడంతో ఇండియా ఇన్నింగ్స్ 162 పరుగులకు ముగిసింది. 31 పరుగులతో విజయం సాధించి ఇంగ్లండ్ సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లారు.ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన యువ ఆటగాడు సామ్ కుర్రన్ (87పరుగులు, 5 వికెట్లు) కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here