సూర్యలతపై సస్పెన్షన్ వేటు

విజయవాడ కనకదుర్గమ్మ చీర దొంగతనం ఆరోపణలతో మంగళవారం ఆలయ పాలకమండలి సభ్యురాలు సూర్యాలతపై సస్పెన్షన్ వేటు పడింది. పాలకమండలి ఛైర్మన్ గౌరంగబాబు సూర్యలతపై వేటు వేశారు. చీర మాయమైన ఘటనపై దుర్గ గుడి ఈవో పద్మ నివేదిక సిద్ధం చేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డులోని సభ్యురాలు సూర్యలత దుర్గమ్మ చీరను తీసినట్లు రిపోర్టులో స్పష్టం చేసారని తెలుస్తోంది.అమ్మవారి చీర మాయమైన విషయం మీద ప్రభుత్వం కూడా సీరియస్ అయిన నేపథ్యంలో ఆలయ ఈవో పద్మ నివేదికను రూపొందించారు. అయితే నివేదికను ప్రభత్వానికి పంపేముందు ఈవో పద్మ పోలీసులతో మాట్లాడటం ఆసక్తిగా మారింది.సీసీ టీవీ ఫుటేజీ లేకపోయినా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం నమోదు చేసినట్లు ఈవో పద్మకు పోలీసులు తెలిపారు. దీంతో వాంగ్మూల నమోదు ప్రతిని తనకు ఇవ్వాలని ఈవో పద్మ పోలీసులను కోరారు. చీర తీసిన పాలకమండలి సభ్యురాలిపై కేసు నమోదైతే ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుంది కనుక కేవలం చర్యలు మాత్రమే తీసుకోవాలని ఈవో నివేదికలో పేర్కొన్నారని తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here