Local news

మందులపై జీఎస్టీ వల్ల సామాన్యులు తీవ్ర అవస్థలు

ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో మెడికల్ రిప్స్ విశాఖ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నగరంలోని సరస్వతి పార్కు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద పెద్దగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకుడు చంద్రమౌళి మాట్లాడుతూ జీఎస్టీలో గల ఐదు శ్లాబుల్లో, మందులను జీరో శ్లాబులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి మందుల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని, దీనిపై అదనంగా జీఎస్టీ కలుపుతున్నారు. దీనివల్ల మందులరేట్లు విపరీతంగా పెరిగిపోవడంవల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Comment here