డిఎస్ తనయుడు ధర్మపురి సంజయ్ అరెస్ట్

లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో మాజీ మేయర్, డిఎస్ తనయుడు ధర్మపురి సంజయ్ ను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు.కేసు నమోదు కాగానే అజ్ఞాతంలోకి వెళ్లిన ధర్మపురి సంజయ్, ఆదివారం న్యాయవాది కృపాకర్ రెడ్డితో కలసి, నిజామాబాద్ ఏసీపీ సుదర్శన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మూడు గంటల విచారణ అనంతరం, పోలీసులు సంజయ్ ను అరెస్ట్ చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరుగుతోంది. సంజయ్ తరుపున ఇద్దరు న్యాయవాదులు, ప్రభుత్వం తరపున ఒక న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా సంజయ్ తరుపు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ కోర్టులో విచారణ జరుగుతోందని, ఒకవేళ రిమాండ్ విధిస్తే., వెంటనే బెయిల్ పిటీషన్ దాఖలు చేస్తామని చెప్పారు. బెయిల్ వచ్చే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here