Cinema

కుళ్ళిన స్థితిలో దర్శకుడు శవం లభ్యం… మృతి పై పలుఅనుమానాలు

సిని పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే దర్శక నిర్మాత ముక్తా శ్రీనివాసన్, సివి రాజేంద్రన్, ఈ ఏడాది ప్రధమార్ధంలో మృతి చెంది సినీ పరిశ్రమకు తీరని లోటు మిగాల్చగా… తాజగా డైరెక్టర్ సి. శివకుమార్
మృతి తో మరింత విషాదం అలుముకుంది. స్టార్ హీరోలు అజిత్ కుమార్, అర్జున్ లతో సినిమాలను తెరకెక్కించిన సి. శివకుమార్ మంగళవారం చెన్నై సాలిగ్రామంలో తన నివాసంలో శవంగా కనిపించారు. ఆయన మృతదేహం కుళ్ళిన స్థితిలో కనిపించడంతో మృతి పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కూడా ఆయన మృతికి సంబంధించిన కారణాలను వెల్లడించలేకపోతున్నారు. డైరెక్టర్ భాగ్యరాజ్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన శివకుమార్ అనంతరం సొంతంగా దర్శకత్వం భాద్యతలు చేపట్టి.. అజిత్ తో సూపర్ హిట్ సినిమా తెరకెక్కించారు.

Comment here