దినకరన్ కారుపై బాంబు దాడి

అన్నాడీఎంకే బహిష్కృత నేత ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కారుపై గుర్తు తెలియని దుండగులు ఆదివారం చెన్నైలో పెట్రోలు బాంబు విసిరారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. ఈ దాడిలో దినకరన్ ఫోటోగ్రాఫర్ తో పాటు డ్రైవర్ కు కూడా గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో దినకరన్ కారులో లేకపోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. గతేడాది తమిళనాడులోని ఆర్కే నగర్ కు జరిగిన ఉపఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై 40,707 ఓట్ల మెజారిటీతో దినకరన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పేరుతో కొత్త పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే…… KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here