Crime News

ధర్మపురి సంజయ్ పై నిర్భయ కేసు

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్ పైన పోలీసులు నిర్భయ చట్టంతోపాటు ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శాంకరి కాలేజీ ఆఫ్ నర్సింగ్ కరస్పాండెంట్ ధర్మపురి సంజయ్ లైంగిక వేధింపులకు సంబంధించి గురువారం హైదరాబాద్ లో హోంమంత్రి నాయని నర్సింహారెడ్డికి, బాధిత విద్యార్థినులు పిర్యాదు చేయడంతో ఆయన స్పందించారు. సమగ్రమైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు. ఇదే విషయమై బాధిత విద్యార్థినులు సీపీ కార్తికేయకు పిర్యాదు చేసారు. సీపీ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఏసీపీ సుదర్శన్ సంజయ్ పై కేసు నమోదు చేశారు. సంజయ్ ను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లగా అక్కడ ఆయన లేరు. సంజయ్ ను అరెస్ట్ చేసేందుకు 4 బృందాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

Comment here