Local news

ధర్మాబాద్ కోర్టుకు హాజరుకాకూడదని చంద్రబాబు నిర్ణయం

బాబ్లీ ప్రాజెక్టు కేసులో ధర్మాబాద్ కోర్టుకు హాజరు కాకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో రీకాల్ పిటీషన్ వేయాలని చంద్రబాబు నిశ్చయించుకున్నారు. బాబ్లీ ప్రాజెక్టు కేసులో చంద్రబాబు నాయుడు సహా 16 మందికి ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి గతనెలలో చంద్రబాబు నాయుడు తరుపున ఎంపీ, న్యాయవాది కె. రవీంద్రకుమార్ హాజరై ధర్మాబాద్ కోర్టులో రీకాల్ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో ముఖ్యమంత్రైనా, మరెవరైనా కోర్టుకు హాజరు కావాల్సిందే అని స్పష్టం చేస్తూ ధర్మాబాద్ కోర్టు కేసు విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే గతనెల 21న కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కేఎస్ రత్నం, ప్రకాష్ గౌడ్ లకు ధర్మాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Comment here