Local news

వైఎస్ఆర్ సిఎం కాకముందు జగన్ వెంట అప్పులోళ్ళు… దేవినేని ఉమ

ఏపి నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ… జగన్ తన సొంత మీడియాను అడ్డు పెట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నాడని.. అటూ ఇటూ కాని మూడో జాతిలా వ్యవహరిస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిఎం కాకముందు జగన్ వెంట అప్పులోళ్ళు వెంటబడే వారు… ఇది నిజం… ఈరోజు జగన్ అనుభవిస్తున్న ఆస్తులు ప్రజధానమే… అని తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్న అవినీతి పరుడు జగన్ అని ఆయన విమర్శలు చేశారు.. అంతేకాదు.. పోలవరం పనులకు సంబంధించి జగన్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.. అది కరెక్ట్ కాదు.. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ ను 50 వేల మంది రైతులు, విద్యార్ధులు సందర్శించారు… ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చూస్తే కనీసం జగన్ కు జ్గానం వస్తుంది.. కానీ ప్రాజెక్ట్ ను చూసే అదృష్టం జగన్ కు లేదని విమర్శలు చేశారు.. తనపై ఉన్న కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను బిజెపి కి తాకట్టు పెట్టిన జగన్ కు సిఎం పిచ్చి కూడా పట్టుకుంది.. అలాంటి జగన్ మా నిజాయతి పై మాట్లాడడం హాస్యాస్పదం అని దేవినేని ఉమ జగన్ పై విరుచుకుపడ్డారు.

Comment here