దీపికా పదుకొనేకు అరుదైన గౌరవం..

దీపికా పదు కొనే క్రీడారంగం నుంచి వెండి తెరపై అడుగు పెట్టి.. స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో దూసుకుపోతుంది. వరస హిట్స్ తో కెరీర్ లో జోరుమీదున్న దీపికా కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరిన సచిన్, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, మాధురీ, కరీనా, కత్రినా కైఫ్ తదితరుల మైనపు విగ్రహాల సరసన దీపిక మైనపు ప్రతిమ కొలువుదీరనున్నది. ఇందులో భాగంగా సోమవారం ముంబైకి చేరుకున్న టుస్సాడ్స్ మ్యూజియం అధికారులు.. దీపిక ముఖం, శరీర కొలతలతో పాటు జుట్టు రంగు తదితర అంశాలను నమోదు చేసుకున్నారు. ఈ విషయాన్ని దీపిక స్వయంగా తన ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించింది. దీనికి సంబంధించి చిత్రవిచిత్రమైన హావభావాలున్న ఫొటోలతో పాటు 11 నిమిషాల నిడివి ఉన్న వీడియోను ఆమె పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తాను చిన్నప్పుడు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు వెళ్లాననీ, కానీ ఇప్పుడు ఏకంగా తన విగ్రహం అక్కడ ఏర్పాటు కానుండటం ఎంతో గర్వంగా ఉందని దీపిక చెప్పింది. అంతేకాదు తాను ఈరోజు ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం సినిమాలు మాత్రమే కాదు.. వాటిని ఆదరించిన అభిమానులు కూడా అని వ్యాఖ్యానించింది. కాగా దీపిక తాను ప్రేమించిన రణవీర్ సింగ్ ను నవంబర్ లో పెళ్లి చేసుకోనున్నడనే పుకార్లు షికారు చేస్తున్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here