విజయవాడలో దళిత హక్కుల దీక్ష

విజయవాడ గాంధీ నగర్ ధర్నా చౌక్ లో సోమవారం దళిత హక్కుల దీక్ష ప్రారంభమయ్యింది. జాతీయ రాష్ట్ర నాయకులు ఈ దీక్షకు హాజరయ్యారు. ఇ. శ్రీనివాసరావు, ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు.దళిత దీక్షను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రారంభించారు. నాయకులు మాట్లాడుతూ., కేంద్రం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్టం చేసి రాజ్యాంగములోని 9వ షెడ్యూల్ ల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని, ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టానికి రక్షణ కల్పించాలని చెప్పారు. రాష్టంలో దళితులపై దాడులు చేసిన ప్రధాన ముద్దాయిలను అరెస్టు చేయాలని, దళితులకు రక్షణ కల్పించాలని వ్యాఖ్యానించారు. కేంద్రం దిగివచ్చే వరకూ పోరాటం చేస్తామని పేర్కొన్నారు….KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here