సీవీసీకు సహకరించనందునే అలోక్ వర్మకు ఉద్వాసన

సీబీఐ చీఫ్ అలోక్ వర్మను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం బుధవారం ఒక ప్రకటనలో సమర్ధించుకుంది. అలోక్ వర్మపై అవినీతి ఆరోపణలపై చీఫ్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) దర్యాప్తునకు ఆయన సహకరించలేదని పేర్కొంది. నిష్పాక్షిక దర్యాప్తు జరగాలనే ఉద్దేశంతోనే అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాలను విధుల నుంచి దూరంగా ఉంచినట్లు తెలిపింది. “సీవీసీ రాజ్యాంగ సంస్థ. కమిషన్ కు సీబీఐ డైరెక్టర్ సహకరించలేదని సీవీసీ అభిప్రాయపడింది. కమిషన్ ఆదేశాలకు ఉద్దేశపూర్వకంగానే వర్మ ఆటంకాలు కలిగించినట్లు సీవీసీ నిశ్చితాభిప్రాయంతో ఉంది” అని ఆ ప్రకటన పేర్కొంది. పదే పదే రిమైండర్లు పంపినప్పటికీ అవసరమైన రికార్డులు, ఫైళ్లు అందించడంలో అలోక్ వర్మ విఫలమయ్యారని కూడా పేర్కొంది. దీంతో అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాలను మంగళవారం నుంచి సెలవుపై పంపేందుకు, సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావుకు తక్షణమే సీబీఐ చార్జి అప్పగించేందుకు నరేంద్ర మోదీ సారథ్యంలోని కాబినెట్ నియామకాల కమిటీ నిర్ణయించిందని ప్రభుత్వ ఉత్తర్వు పేర్కొంది. కాగా తనను సెలవుపై పంపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అలోక్ వర్మ బుధవారం సుప్రీంకోర్టులో సవాలు చేయడం, ఈ నెల 26న దీనిపై విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించడంతో మొత్తం వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here