రాగి పాత్రలో నీరు తాగడం వల్ల లాభాలేమిటో తెలుసా..!!

ప్రస్తుత కాలంలో అంతా ప్లాస్టిక్ మయం… ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాడకమే కనిపిస్తుంది. కానీ మన ముందు తరాల్లో.. ఎక్కడ ఏ ఇంట్లో చూసినా రాగి పాత్రలే కనిపించేవి. ఎందుకంటే రాగి పాత్రలుంటే రోగాలు రావు అనేవారు.
ఇంతకు రాగినే ఎందుకు అన్నారో తెలుసా! రాగికి యాంటి బ్యాక్టీరియల్ నేచర్ ఉంటుంది. రాగితో చేసిన పాత్రలలో సూక్ష్మక్రిములు చేరే అవకాశం లేదు. కనుక ఇందులో వున్న పధార్దాలు చెడిపోయే అవకాశాలు చాలా తక్కువ. మనకి వచ్చే చాలా రోగాలకి నీటి కాలుష్యం ముఖ్యమైన కారణం. రాగి పాత్రలలో నీళ్ళు కనుక ఉంచితే అందులో క్రిములు చేరే అవకాశం చాలా అరుదు. అందుకే పాత రోజుల్లో రాగిబిందెలు వాడేవారు. గతంలో నీళ్ళు వేడి చేసుకోవడానికి రాగితో చేసిన బాయిలర్స్ వాడే వారు.. అందులో నీరు స్నానం చేయడం వల్ల చర్మ సంబంధిత రోగాలు కూడా దరిచేరేవి కావట. కానీ ఇప్పుడు ఉన్న కాలంలో రాగి పాత్రలు అన్ని కొనలేము కానీ కనీసం ఒక చెంబు అయిన మన ఇంట్లో ఉండే విధంగా చూసుకోవాలి ఎందుకంటే రాగి పాత్రల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి.

సూర్యకిరణాలు రాగిపాత్రలపై పడినపుడు సంభవించే రసాయన క్రియ కారణంగా అందులోని సూక్ష్మక్రిములు చనిపోతాయి. రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలకు దాదాపుగా దూరంగా ఉండొచ్చు. శరీరంలో కాపర్‌ నిల్వలు తగ్గిపోవడం వల్ల థైరాయిడ్‌ సమస్య వస్తుంది. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగితే నీటిలోని అయానికత వల్ల శరీరంలో కాపర్‌ నిల్వలు పెరుగుతాయి. ఫలితంగా థైరాయిడ్‌ సమస్యలను నివారించవచ్చు.
అజీర్తి, కడుపులో మంట, ఎసిడిటీ మొదలైన జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు రాగి చెంబులో నీరు తాగితే ఫలితముంది. అలాగే మెదడుకు సంకేతాలను అందించడంలో తోడ్పడే న్యూరాన్లకు కవచంలా ఉపయోగపడే మైలీన్‌ తొడుగులు తయారు కావడానికి రాగి పాత్రలో ఉంచిన నీరు చాలా ఉపయోగపడుతుంది.
నీటి ద్వారా వ్యాపించే డయేరియా వంటి వ్యాధులు రాకుండా చేయడంలో ఇది సహాయపడుతుంది. శరీరంలోని రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేయడంలో కాపర్‌ తనవంతు పాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలో క్యాన్సర్‌ కణాలు ఏర్పడకుండా నివారిస్తుంది. అంతేకాదు, బరువు తగ్గిస్తుంది. ఎముకలు పటిష్టత ఆర్థరైటిస్‌, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వంటి సమస్యలను నివారించడంలో రాగి పాత్రలో నీళ్ళు ఎంత గానో ఉపయోగపడతాయి.
పరగడుపున రాగి చెంబులో నీళ్లు తాగడం వలన పెద్ద పేగు శుభ్రపడి మనం తినే ఆహారంలోని పోషకాలను ఎక్కువ శాతం గ్రహిస్తుంది.
శరీరంలో కొత్త రక్తం తయారీకి కండరాలలో కణాల ఉత్పత్తిని పెంచుతుంది.
రక్త కణాలను శుద్ధి చేయడం వలన శరీరంలో మలినాలు తగ్గుతాయి. దాంతో శరీర ఛాయ ప్రకాశిస్తుంది.
శ్వేత ధాతువులను సమతుల్యం చేస్తుంది. ఈ చర్యవల్ల శరీరంలో ద్రవపదార్ధాలను కోల్పోనీకుండా ఇన్‌ఫెక్షన్‌ను దరి చేరనీయదు.
అరగంట లోపు సుఖవిరేచనం అగుతుంది . మలబద్దకం , తేపులు మొదలయిన బాదలన్ని ఈ అలవాటు తో పూర్తిగా నిర్మూలించబడును. ప్లాస్టిక్ ని నివారించి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి పాత్రలోని నీటిని తాగుదాం… ఆరోగ్యంగా ఉందాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here