పెళ్లి వార్తలను ఖండిస్తూ ట్వీట్ చేసిన తమన్నా

ఒకప్పుడు యాక్టర్ తో నాపెళ్లిన్నారు. మరోసారి క్రికెటర్ తో అన్నారు. ఇప్పుడేమో డాక్టర్ తో అంటూ రాస్తున్నారు. ఇలాంటి వార్తలను వింటుంటే నేను భర్త కోసం షాపింగ్ చేస్తున్నానేమో అనే ఫీలింగ్ కలుగుతోంది. నాకు ప్రేమ అనే భావన ఇష్టమే కానీ, పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేస్తూ ఇలాంటి రూమర్స్ పుట్టించడమే సరికాదు. ప్రస్తుతం నేను సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను. నా తల్లిదండ్రులు నాకోసం వరుడిని వెతికే పనిలో లేరు. ప్రస్తుతం నేను సినిమాలకు సంబంధించిన వ్యవహారాలతో రొమాన్స్ చేస్తున్నాను. నాపనిలో నేను బిజీగా ఉంటే ఇలాంటి రూమర్స్ ఎందుకు పుట్టిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు. ఒకవేళ నేను వెళ్లి చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అందరికీ చెప్పే చేసుకుంటాను. సో అప్పటివరకూ మీ ఊహాలతో నాకు పెళ్లి చేయడం మానుకోండి అంటూ వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టె ప్రయత్నం చేసింది. మరి ఇంత క్లారిటీ తర్వాత నైనా తమన్నా పెళ్లి వార్తలకు బ్రేక్ పడుతుందేమో చూద్దాం…….KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here