అమరావతిని అడ్డుకునేందుకు రెండు పార్టీల కుట్ర : పుల్లారావు

రాజధాని అమరావతిని అడ్డుకునేందుకు వైసీపీ, జనసేన లు కలసి కుట్రలు చేస్తున్నాయని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకూ వైసీపీ కేసులతో రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటే.., ఇప్పుడు పవన్ కల్యాణ్ రైతులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులు వేల ఎకరాలు సమీకరణ కోసం ఇచ్చారని…, ఇప్పుడు ఆ నమ్మకాన్ని చెడగొట్టేందుకు చేసే వారి ప్రయత్నాలు ఫలించవని అన్నారు. రాజధానిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే రైతులు తిరగబడటం ఖాయమని చెప్పారు. అసైన్డ్ భూములకు కూడా ప్రభుత్వం సమీకరణ ద్వారా స్థలాన్ని ఇచ్చిందని.., అమరావతిలో రాజధాని రావడం వల్ల భూముల రేట్లు కోట్ల రూపాయలకు చేరిందని.., ఇప్పుడు రాజధానిని అడ్డుకుంటామంటే నష్టపోయేది పెదరైతులు కాదా? అని ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలు, రాజధాని పర్యటనల వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తముందేమోనన్న అనుమానం తెలుగు ప్రజలకు కలుగుతోందని? ఇకనైనా ఈ కుట్రలు అప్పాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు……KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here