National

మోడి పై ప్రాంతీయ పార్టీల ‘చెయ్యి’తో ఉమ్మడి పోరు

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కుతున్నాయి. 2014 ఎన్నికల్లో మోడీ షా ద్వయం ” కాంగ్రెస్ పాలన నుంచి దేశానికి విముక్తి” అనే నినాదంతో ముందుకొచ్చారు.. భారతీయ జనతాదళ్ పార్టీ సంచలన విజయం అందుకొని … కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మోడీ పై ఉన్న వ్యతిరేకతను ఒడిసి పట్టుకుని.. భారతీయ పార్టీకి నెక్స్ట్ ఎన్నికల్లో అధికారం దూరం చేసే విధంగా కాంగ్రెస్ ఆలోచనలు చేస్తోంది. దీంతో 2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ముందు ఒకటే లక్ష్యం ఉంది.. అదే మేము గెలవక పోయినా ఓకే.. కానీ బిజేపీ మాత్రం గెలవకూడదు.. వారు మళ్ళీ అధికారంలోకి రాకూడదు… మోడీ-బిజేపీ రహిత సర్కార్ అనే నినాదంతో ఈ ఎన్నికల్లో ఓటర్ల ముందుకు రానున్నది. ఇందుకోసం కాంగ్రెస్ అధిష్టానం పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తోంది.. ప్రాంతీయ పార్టీలను కలుపుకుని.. ముందుకు వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది.. దేశవ్యాప్తంగా మోడిపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ ఓట్లుగా మలుచుకోనేంత సీన్ ప్రస్తుతం లేదు.. ముఖ్యంగా దక్షిణదిలో ప్రాంతీయ పార్టీలు బలీయంగా ఉన్నాయి.. దీంతో ప్రాంతీయ పార్టీల్లో బలమైన వాటిని కలుపుకుని .. మోడీ పాలనకు చెక్ పెట్టడమే.. కాంగ్రెస్ లక్ష్యం.. ఈ నేపథ్యంలో మహా కూటమి నిర్మాణం కోసం రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు.

కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరిస్తే.. తాను ప్రధాని అని… లేదంటే ఆర్ఎస్ఎస్ కు సపోర్ట్ చేసే బిజేపీ నేతలు, మోడీ మినహా ఎవరు ప్రధాని అయినా తనకు అభ్యంతరం లేదని రాహుల్ ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని పదవి పై చాలా మంది సీనియర్ నాయకుల్లో ఆశలు రేకెత్తాయి..
ముఖ్యంగా ప్రధాని పీఠంపై రాజీవ్ గాంధీ హత్య తర్వాత నుంచి ఆశ పెట్టుకున్న శరద్ పవర్ నుంచి పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, బిఎస్పీ నాయకురాలు మాయావతి కూడా ఈ రేస్ లో ఉన్నారు. అయితే గతంలో వీరందరూ.. విడివిడిగా ప్రధాని పదవి అలంకరించాలని భావించి ప్రయత్నించే వారు.. కానీ వీరిప్పుడు.. ప్రధాని మోడీ ని ఓడించడమే లక్ష్యంగా ఏకమై.. ఉమ్మడి పోరాటానికి సిద్ధ పడుతున్నారు. మోడీ-బిజేపీ రహిత సర్కార్ అనే నినాదాన్ని నిజం చేసేందుకు జమ్మూ కాశ్మీర్ మాజీ సిఎం ఒమర్ అబ్దుల్లా కూడా చాలా చురుకైన పాత్రను పోషిస్తున్నారు. తమ పార్టీ చిన్నదే… కానీ విపక్షాల ఐక్యత కోసం పనిచేస్తా.. మోడీ హటావో అనే మాటను నిజం చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను అని చెబుతున్నారు. ఇప్పటికే కోల్ కతకు వెళ్లి మమతా బెనర్జీ తో భేటీ అయ్యారు.. గత కొన్ని ఏళ్ల నుంచి బీజేపీ దేశంలో బాగా బలపడింది.. గత ఎన్నికల్లో… ఏ పార్టీ సహకారం లేకుండా అధికారం చేపట్టే విధంగా సీట్లను గెలుచుకుంది.. తన పరిధిని పెంచుకుంది.. కనుక విపక్షాల ఐక్యతే… ఇప్పుడు బిజేపీ ని ఓటమి దిశగా తీసుకేల్లగలదు… ఇందుకు కాంగ్రెస్ ముఖ్య పాత్ర పోషించాలని అని ఒమర్ అబ్దుల్లా చెప్పారు.
ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతీయ పార్టీ బలంగా ఉంది.. ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాది, బిఎస్పీ, బిజార్ లో ఆర్జెడి, పశ్చిమ బెంగాల్ లో తృణమల్, దిల్లీలో ఆప్, కాశ్మీర్ లో ఎన్సీ, పిడిపి, ఒడిస్సా లో బిజెడి వంటి ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండగా.. ఇటు దక్షిణాదిలో తమిళనాడు లో డిఎంకె, అన్నా డిఎంకే లు బలంగా ఉన్నాయి.. ఇక ఏపీలో టిడిపి, వైఎస్సార్ సిపి, తెలంగాణాలో టిఆర్ఎస్ లు బలమైన ప్రాంతీయ పార్టీలు.. ఈ ప్రాంతీయ పార్టీల బలం లోక్ సభలో 30 నుంచి 40 కి మధ్య లోనే ఆగిపోతుంది… ఇక కేంద్రంలో అధికారం కోసం తహతహలాడుతున్న బిజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రాబల్యం రాష్ట్రాల్లో చాలా తక్కువుగానే ఉంది.. ఇక ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీగా మారి.. పక్క రాష్ట్రాలకు విస్తరించలేని పరిస్థితి… దీంతో కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి… ఎన్నికల బరిలోకి దిగితే… కాంగ్రెస్ గెలుచుకొనే స్థానాలకు.. ఈ ప్రాంతీయ పార్టీల ఎంపీల సంఖ్య తోడైతే..
మహాకుటమి అధికారంలోకి రాగలదు అని రాజకీయ విశ్లేషకుల అంచనా… దీంతో ప్రాంతీయ పార్టీల “చెయ్యి ” పట్టుకు కాంగ్రెస్ నడిస్తేనే.. గెలుపుకు బాట వేసుకుంటుంది అని అంటున్నారు. .. పైగా కాంగ్రెస్ అధినాయకత్వం కూడా తాము అధికారంలో లేక పోయినా పర్వాలేదు.. మోడీ అధ్వర్యంలో బిజేపీ పార్టీ అధికారం చేపట్టకూడదు అనే ఆలోచనలో సాగుతుంది.. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల్లో తాము 80 మంది ఎమ్మెల్యేలు గెలిచి కూడా ప్రభుత్వ ఏర్పాటు కోసం జనతాదళ్‌ (ఎస్‌) సిఎం కుర్చీ ఆఫర్ ఇచ్చి మరీ బిజేపీ కి అక్కడ అధికారంలో కూర్చునే అవకాశం లేకుండా చేశారు.. తాము ప్రాంతీయ పార్టీలు కలిసి వస్తే.. జాతీయ స్థాయిలో కూడా నమ్మకమైన మిత్ర పక్షంగా ఉంటామనే సంకేతాలు ఇచ్చారు… ఇక ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తాను ప్రధాని పదవి కోసం తహతహాలడం లేదని… సంకేతాలను ఇచ్చారు.. మోడీ షా ద్వయాన్ని ఓడించడానికి ప్రాంతీయ పార్టీలతో కలిసి.. కాంగ్రెస్ మహాకుటమి గా ఏర్పడి.. పెద్దన్న పాత్రను పోషిస్తుందా.. చూడాలి మరి.. !!

Comment here