Local news

వైఎస్సార్ సిపిలో చేరిన కమెడియన్

ఏపిలో రోజు రోజుకీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసిపి వైపు కొంత మంది సిని తారలు చూస్తున్నారు.. ఇప్పటికే పృథ్వి, పోసాని. చోటా కె నాయుడు వంటి వారు జగన్ పాదయాత్రలో పాల్గొని.. తమ మద్దతు తెలిపారు.. కాగా తాజాగా కమెడియన్ కృష్ణుడు వైఎస్సార్ సిపిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న జగన్ సమక్షంలో కృష్ణుడు చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పెన్మత్స సురేష్ బాబు, సర్రాజు, సూర్యనారాయణ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ… తనకు జగన్ పాదయాత్ర నచ్చిందని… అందుకనే తాను పార్టీలో చేరినట్లు.. వైఎస్సార్ సిపి విజయానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

Comment here