ప్రత్యేక హోదా కోసం ఓ యువకుడు ఆత్మహత్య

ఏపీ కి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. హోదా ఇవ్వాలంటూ మరో ఆత్మబలిదానం జరిగింది. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా మదన పల్లిలో చోటు చేసుకుంది. సుధాకర్ అనే చేనేత కార్మికుడు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సుధాకర్ ఆత్మహత్య చేసుకోనేముందు… రూ.5 వేల ను చైతాన్య బాలల అనాధాశ్రమం కి సహాయం గా ఇచ్చి తన మంచి మనసు చాటుకున్నాడు. సుధాకర్ ఆత్మహత్యతో స్నేహితులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సుధాకర్ మృతి కి ప్రతిపక్ష నేత జగన్, ప్రత్యెక హోదా సమతితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సంతాపం తెలియజేశారు. ఆత్మహత్యలతో ప్రత్యెక హోదా రాదని.. అది పరిష్కారం కాదని.. పోరాటమె ఆయుధం అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here