నేడు ప్రారంభం కానున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్

ప్రపంచ ఛాంపియన్ షిప్ బ్యాడ్మింటన్ లో అత్యుత్తమ టోర్నీ… ఈ మెగా టోర్నీ చైనాలో సోమవారం నుంచి మొదలు కానున్నాయి. నంజింగ్ ఒలింపిక్స్ స్పోర్ట్స్ సెంటర్ లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఆగష్టు 5 వరకు కొనసాగనున్న ఈ ఛాంపియన్ షిట్ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ప్రపంచంలో ఆగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు చాంపియన్‌షిప్‌లో తలపడను న్నారు. తొలిసారి భారత్‌ నుంచి అత్యధిక షట్లర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.. స్టార్ షట్లర్స్ పివి సింధూ, సైనా నెహ్వాల్‌, కిదంబి శ్రీకాంత్‌ లతో పాటు… హెచ్‌ఎస్‌ ప్రణరు, బి సాయి ప్రణీత్‌, సమీర్‌ వర్మ లు సింగిల్స్‌ లో పోటీ పడనున్నారు. ఇక పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌-చిరాగ్‌ షెటీ, మను అత్రి-సుమిత్‌ రెడ్డి, సౌరభ్‌ శర్మ-అనోష్క పారిఖ్‌, అర్జున్‌ ఎంఆర్‌-రామచంద్రన్‌ శ్లోక్‌, తరుణ్‌ కోనా- సౌరభ్‌ శర్మ జోడీలు భారత్‌ నుంచి పాల్గొంటున్నాయి. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప- ఎన్‌ సిక్కి రెడ్డి, కహో జార్జ్‌-నింగ్సి బ్లాక్‌ హజరిక, జక్కంపూడి మేఘన- రామ్‌ పూర్విష, సంయోగిత- ప్రజక్త సవత్‌ జోడీలు పాల్గొంటున్నాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత్‌ నుంచి రోహన్‌ కపూర్‌-కహో జార్జ్‌, అశ్వినిపొనప్ప- సాత్విక్‌, సిక్కిరెడ్డి- ప్రణవ్‌ జెర్రీ చోప్రాలు పాల్గొంటున్నాయి. ఈ చాంపియన్‌షిప్‌లో పివి సింధూకు మంచి రికార్డు ఉంది. 2013, 2014ల్లో కాంస్య పతకాలు సాధించిన సింధూ, గత ఏడాది మాత్రం రజతం సాధించింది. మరో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ కూడా 2015, 2017ల్లో ఈ టోర్నిలో కాంస్య పతకాలు సాధించింది. కానీ ఇప్పటి వరకూ ఈ టోర్నీలో భారత్ ఒక్కసారి కూడా స్వర్ణాన్ని అందుకోలేదు.. మరి ఈ టోర్నీలో అయినా మన క్రీడాకారులు స్వర్ణం అందుకోవాలని భారతీయ క్రీడాభిమానుల ఆశ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here