ముఖ్యమంత్రి యువనేస్తం

గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ భృతి పథకానికి “ముఖ్యమంత్రి యువనేస్తం” అని పేరుపెట్టామన్నారు. నిరుద్యోగ భృతి నెలకు 1000 రూ. ఇస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగ భృతిని నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. ఆగస్టు 3 లేదా 4వ వారంలో రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తామని, దీనికి 22 సంవత్సరాల వయస్సు నుండి 35 సంవత్సరాల వయస్సు కల నిరుద్యోగులు అర్హులని చెప్పారు. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని, అప్రెంటిషిప్ క్రింద వివిధ సంస్థలలో నిరుద్యోగులకు పని కల్పించాలని యోచిస్తున్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here