CinemaMovies Reviews

రివ్యూ: చి.ల.సౌ … ఈ వారం ఫ్యామిలీ తో చూడదగ్గ సినిమా

రివ్యూ: చి.ల.సౌ

బ్యానర్స్: అన్నపూర్ణ స్టూడియోస్, సిరునీ సినీ కార్పోరేషన్
నటీనటులు: సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిషోర్, అనుహాసన్, జయప్రకాశ్, సంజయ్ స్వరూప్, రాహుల్ రామకృష్ణా, విద్యుల్లేఖా రామన్ తదితరులు
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాతలు నాగార్జున అక్కినేని, జస్వంత్ నడిపల్లి, భరత్ కుమార్, హరి పులిజల
సినిమాటోగ్రఫర్ : సుకుమార్ ఎం
దర్శకత్వం రాహుల్ రవీంద్రన్
విడుదల తేది: 03-08-2018

అక్కినేని కాంపౌండ్ నుంచి హీరోగా వెండి తెరపై అడుగు పెట్టి దాదాపు దశాబ్దకాలం దాటుతున్నా కూడా ఇప్పటి వరకు సరైన హిట్ అందుకోలేదు.. తనని తాను హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు..
ఈసారి ఫార్ములా కథలకు బ్రేక్ ఇచ్చి ఒక సింపుల్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుశాంత్. అదే చి.లసౌ సినిమా…. హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ఈ సినిమాతో దర్శకుడుగా మారాడు… సినిమా ప్రకటించిన ఎవరు పెద్దదా ఆసక్తి కనబరచలేదు… టీజ‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుండి సినిమాపై ఆస‌క్తి పెరిగింది. సినిమాను అన్న‌పూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేయ‌డానికి ముందుకు రావ‌డం ఈ సినిమాకు పెద్ద ప్ల‌స్ అయింది. ప్రీరిలీజ్ టాక్ తోనే హిట్ సినిమా అనే ఫీలింగ్ ని కలిగించిన చిలాసౌ ప్రేక్షకులకు ఫీలింగ్ ను అందించిందో తెలుసుకుందాం..

కథ:

అర్జున్‌(సుశాంత్‌) ఇర‌వైయేడేళ్ల కుర్రాడు. మంచి ఉద్యోగం చేస్తుంటాడు. అత‌ని త‌ల్లిదండ్రులు(అను హాస‌న్‌, సంజ‌య్ స్వ‌రూప్‌) పెళ్లి చేసుకోమ‌ని పోరు పెడుతుంటారు. అర్జున్ పెళ్ళికి ఇంకా ఐదేళ్ళు టైం కావాలని కోరుకుంటాడు. అయినా జీవితాంతం కలిసి ఉండబోయే అమ్మాయిని ఐదు పది నిమిషాల్లో ఎలా నిర్ణయించుకుంతరనేది.. అర్జున్ ఆలోచన…. దీంతో అర్జున్ అమ్మ ఇంట్లోనే ఎవ‌రూ లేకుండా కేవ‌లం అర్జున్ మాత్రమే ఉండేలా అంజ‌లి(రుహానీ శ‌ర్మ‌)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది. పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పేస్తాడు. కానీ అంజలి తో కాసేపు మాట్లాడాక తన పై ఇష్టం కలుగుుతంది. అంజలి కి పెళ్ళి ఇష్టం కాదు, అవసరం. తల్లి ఆరోగ్యం పాడవతుందనే భయంతో పెళ్ళికి ఒప్పుకుంటుంది. అంజలి కి నో చెప్పాక, మళ్ళీ యస్ అనిపించుకోవడానికి మద్య జరిగే ఒక రోజు ప్రయాణమే ఈ కథ.

విశ్లేషణ:
ముందుగా మనం హీరో నుంచి దర్శకుడు గా పరిచయం అయిన రాహుల్ యూత్ కి బాగా దగ్గరయ్యే పాయింట్ ని తీసుకుని అందమైన ఒక ప్రేమకథ చెప్పడంలో అయ్యాడు. దర్శకుడిగా తొలి ప్రయత్నమే అయినా లిమిటెడ్ క్యారెక్టర్స్ అండ్ సిట్యువేషన్స్ ఉన్న కథను తెరకెక్కించడంలో అతను అనుభవం ఉన్న దర్శకుల కంటే మెరుగ్గా అనిపించాడు. ఇక హీరో సుశాంత్ ఇప్పటి వరకూ క‌మ‌ర్షియ‌ల్ హీరోగా రాణించేయాల‌ని ఏవేవో ప్ర‌య‌త్నాలు చేశాడు కానీ.. త‌న బాడీ లాంగ్వేజ్‌కి త‌గినట్లు క‌థ‌ల‌ను ఎంపిక చేసుకోవాల‌నే ఆలోచ‌న‌ను ఇన్నాళ్లు మ‌ర‌చిపోయాడేమో.. ఈ సినిమాకు అది గుర్తించాడ‌నే భావ‌న ఏర్ప‌డుతుంది. అర్జున్ పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించాడు. హీరో పాత్ర మ‌న పక్కింటి కుర్రాడిలా ఉండి ఆకట్టుకుంటుంది. ప్రతి చిన్న విషయాన్నీ సమస్యగా తీసుకుని… కన్ ఫ్యూజన్ గా ఆలోచించే హీరోకు, ప్రతి విషయంలోనూ ప్రాక్టికల్ గా ఉండే అమ్మాయి పెళ్లి చూపులలో పరిచయం అవుతుంది. ఒంటరిగా ఉన్న హీరో ఇంటికి హీరోయిన్ ఒంటరిగా పెళ్లి చూపుల కోసం రావడం అనే ఆలోచన చాలా ప్రెష్ గా అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ ని పరిచయం అయి అలవాటు అవడం మొదలయ్యాక ఆ అమ్మాయి లుక్స్ ని పెద్దగా పట్టించుకోనంత అందమైన క్యారెక్టర్ ని డిజైన్ చేసాడు రాహుల్. పెద్దలు కుదిర్చిన పెళ్ళిలో అమ్మాయిలు కోల్పోయే ఆత్మగౌరవాన్ని ప్రతి బింబించే మాటలు అర్జున్ ఆలోచనలు లో మార్పులు తెస్తాయి. పెద్ద హాడావుడి లేకుండా పెళ్ళి చూపుల తంతు ముగిస్తే బాగుంటదనే ఫీలింగ్ చూస్తున్న ఆడియన్స్ కి ఒక్కసారైనా కలుగుతుంది. ఇష్టమే కానీ ప్రేమో కాదో తెలియదు ఇంకా కొంచెం టైం కావాలి అనే ఫీలింగ్స్ ఉండే యూత్ కి మిర్రర్ ఇమేజ్ లా ఉండే పాత్రలో ఇట్టే దూరిపోయాడు. సినిమాలో పెద్దగా క్యాస్టూమ్స్ ఉండవు.. హీరో షాట్స్ మీదుంటే, హీరోయిన్ సల్వార్ లో కనిపిస్తుంది. అయినా వీరిప్రేమకథ చాలా అందంగా కనిపించింది. కారణం ఆ ప్రేమకథలో కనిపించే నిజాయితీ. వెన్నెల కిషోర్ ఈ కథలో కనిపించిన ప్రతి సారి నవ్వించాడు. రోహిణి పాత్రతో తల్లిప్రేమను, రుహాణి పాత్రతో తల్లి దండ్రుల మీద పిల్లలకుండే బాధ్యతను చాలా బాగా చూపెట్టాడు దర్శకుడు. తనకున్నంతలో ఎవరి సాయం లేకుండా ఆత్మగౌరవంతో బతకాలనుకునే అంజలి పాత్రతో ప్రతి ప్రేక్షకుడు ప్రేమలో పడతాడు. అందుకు హీరో ముందు కాదని తర్వాత ఆమె వెంట పడుతున్నా నిజమే కదా, ఇంత మంచి అమ్మాయిని వదులుకోకూడదు అనిపిస్తుంది. రాహుల్ క‌థ‌ను హ్యాండిల్ చేసిన తీరు మెచ్చుకోలుగా ఉంది. ఇక ప్ర‌శాంత్ విహారి పాట‌లు క‌థ‌లో భాగంగానే సాగిపోయాయి. ఆర్‌.ఆర్ బావుంది. సుకుమార్ కెమెరావ‌ర్క్ బావుంది. తొలి ప్ర‌య‌త్నంలో ఏదో కొత్త‌ను చెప్పాల‌ని కాకుండా తెలిసిన క‌థ‌ను కొత్త‌గా చెప్పాల‌ని రాహుల్ ప్ర‌య‌త్నం స‌క్సెస్ అయింది. హీరో పెళ్లి వ‌ద్దునుకోవ‌డం.. చివ‌ర‌కు కావాల‌నుకోవ‌డం.. హీరోయిన్ ముందుగా పెళ్లి చేసుకోకూడ‌ద‌ని అనుకున్నా.. తల్లి కోసం పెళ్లి చూపులు చూడ‌టం.. హీరో.. హీరోయిన్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు.. చాలా ఆహ్లాదంగా ఉన్నాయి. ]

చివరిగా …. ఈ వారం ఫ్యామిలీ తో చూడదగ్గ సినిమా చి.ల.సౌ

Comment here