National

చార్మినార్, గోల్కొండ.. ప్రవేశ చార్జీ పెంపు

కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే చారిత్రిక నిర్మాణాలైన చార్మినార్, గోల్కొండ ప్రవేశ చార్జీ పెరిగింది. దేశీయ, సార్క్ దేశాలకు చెందినవారికి 15 రూ. నుంచి 25 రూ.కు పెంచారు. విదేశీ పర్యాటకులకు 200 రూ. నుంచి 300 రూ. కు పెంచారు. ఈ రెండు నిర్మాణాలతో పాటు దేశంలోని పురావస్తు శాఖకు చెందిన అన్ని ప్రదేశాల ప్రవేశ చార్జీలు ఇదే మాదిరిగా పెంచారు. రెండేళ్ల క్రితమే 5 రూ. నుంచి 15 రూ. కు పెంచిన ప్రభుత్వం, తాజాగా మళ్లీ పెంచింది. 12 సంవత్సరాల లోపు పిల్లల వరకూ మాత్రం ఎలాంటి చార్జీ లేకుండా ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నారు.

Comment here