కాపు రిజర్వేషన్ల కోసం పోరాడండి : చంద్రబాబు

అధికారంలోకి వచ్చాక బిజేపీ పార్టీ ఏపి కి అన్ని విధాల అన్యం చేస్తూనే ఉంది.. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సుప్రీంకోర్టులో మాత్రం హమీలకు విరుద్దంగా కేంద్రం అఫిడవిట్లు సమర్పించడంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తీరును పార్లమెంట్ వేదికగా ఎండగట్టాలని ఆయన ఎంపీలకు సూచించారు.
సోమవారం నాడు ఉదయం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టీడీపీ ఎంపీలతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్పరెన్స్‌లో పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బాబు పార్టీ ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు.

కాపు రిజర్వేషన్లపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చేసిన ప్రకటన నేపథ్యంలో రాజకీయంగా జగన్ ను ఇబ్బందిపెట్టే ఉద్దేశ్యంతో కాపుల రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో చేర్చాలనే డిమాండ్‌తో ఆందోళన చేయాలని బాబు పార్టీ ఎంపీలకు సూచించారు. కేంద్రం చెప్పేదొకటి.. చేసేదొకటనే విషయం అఫిడవిట్లతో తేటతెల్లమైందనే విషయం తేలిందన్నారు. ఈ తరుణంలో పార్లమెంట్ సాక్షిగా బీజేపీ బండారాన్ని బట్టబయలు చేయాలని ఆయన పార్టీ ఎంపీలకు సూచించారు.

కాపుల రిజర్వేషన్లను రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలన్నారు. కాపుల రిజర్వేషన్ల విషయమై జగన్ బండారాన్ని బట్టబయలు చేయాలని ఆయన సూచించారు. బీజేపీతో జగన్ కుమ్మకైన విషయాన్ని బయటపెట్టాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయమై రాజీపడకూడదని ఎంపీలకు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here