కరుణానిధిని పరామర్శించడానికి చెన్నై చేరుకున్న చంద్రబాబు

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డిఎంకె అధినేత మాజీ సిఎం కరుణానిధి చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపద్యంలో కరుణానిధిని చూడడానికి రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే తమిళనాడు సిఎం పళని స్వామి, ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సిని నటుడు విజయ్ వంటి వారు కరుణానిధిని పరామర్శించారు. తాజాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు కరుణానిధిని పరామర్శించారు.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పటికే కరుణానిధిని పరామర్శించడానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ తమిళనాడు చేరుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here