చంద్రబాబు కర్నూలు అసెంబ్లీ నుంచి పోటీ చేయాలి : టీజీ.భరత్

జీ.భరత్ పుట్టినరోజు సందర్భంగా కర్నూలు నగరంలోని క్రీడా మైదానంలో టీజీబీ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మీడియాతో మాట్లాడుతూ
కర్నూలు నగరం రాజధాని అమరావతితో సమానంగా అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రాజ్యసభ సభ్యుడు టీజీ.వెంకటేశ్ తనయుడు టీజీ.భరత్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కర్నూలు నుంచి పోటీ చేస్తే జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలు టీడీపీ గెలుస్తుందన్నారు.ఆయన కర్నూలు నుంచి పోటీ చేయని పక్షంలో ఇక్కడ సర్వే ప్రకారము సీటు కేటాయించాలని టీజీ.భరత్ విజ్ఞప్తి చేసారు. మంత్రి నారాలోకేశ్ ఇటీవలే కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు కర్నూల్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా స్థానిక ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్ రెడ్డికి కేటాయిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here