సయ్యద్ అక్బరుద్దీన్ తో చంద్రబాబు భేటీ

యూఎన్ఓ సదస్సులో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి.. రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ తో భేటి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో జీరో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు., తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై స్పందిస్తూ సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఆలోచనలు, చురుకైన నాయకత్వం, ఆంధ్రప్రదేశ్ ను ఆదర్శ, స్ఫూర్తివంతమైన రాష్ట్రంగా తీసుకెళ్తాయన్నారు. రైతులకు రెట్టింపు ఆదాయాన్ని తీసుకొచ్చే మార్గాలపై భేటీలో చర్చ జరగనున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు యూఎన్ఓ సదస్సులో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన చంద్రబాబు నాయుడుకు న్యూయార్క్లో ఘనస్వాగతం లభించింది. సీఎం చంద్రబాబు బృందానికి ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here