అమెరికా పర్యటనలో చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ ఏడాదిని ప్రకృతి సేద్యం సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో అదే అంశంపై చంద్రబాబు నాయుడు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తారు. న్యూయార్క్ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2024 నాటికి ప్రకృతి సేద్యంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడుకు అరుదైన గౌరవం దక్కింది. ముఖ్యమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అడుగు పెట్టే అరుదైన అవకాశం కలిగింది. అంతే కాదు., ప్రపంచానికే ఎంతో కీలకమైన ప్రకృతి సేద్యానికి సంబంధించిన అంశంపై కీలక ప్రసంగం చేయనున్నారు. సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత, అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు అనే అంశంపై చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేయనున్నారు. మామూలుగా ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే అవకాశం ప్రపంచ దేశాల అధినేతలకు మాత్రమే ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడుకు ఈ వేదికపై ప్రసంగించాలంటూ ఐక్యరాజ్యసమితి ఆహ్వానించింది. 23వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికాలో పర్యటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here