రేపు కరుణానిధిని పరామర్శించనున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం చెన్నై వెళ్లి డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయిన కరుణానిధిని, కావేరీ ఆస్పత్రికి చేరుకుని ఆయనను, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. ఆయన జులై 27 నుంచి కావేరీ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది.ఆకార్యక్రమం ముగించుకుని తిరిగి సాయంత్రం తిరుపతి కి చేరుకొన్న చంద్రబాబు నాయుడు ఎస్వీయూలో విద్యార్థులతో “జ్ఞానభేరి” పేరిట ముఖాముఖి నిర్వహించనున్నారు. వారికి లక్ష్యాలను బోధించడంతో పాటు మెరుగైన పాలనకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు స్వీకరించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here