Local news

పవన్ మొదట్లో బాగానే ఉండేవారు.. ఇప్పుడు బాట మారింది.. స్వరం మారింది..

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు ప్రజల వద్దకు చేరుకుంటున్నారు. సిఎం చంద్రబాబు మరో సారి గ్రామదర్శి వేదికగా కేంద్రం ఏపీ కి చేసిన అన్యాయం పై విరుచుకుపడ్డారు. మాట తప్పింది… మడమ తిప్పింది కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ నేతలే అని… కేంద్రం నుంచి ఎపీకి రావాల్సింది.. వడ్డీతో సహా రాబడతామని చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. అటు కేంద్రంతో పాటు.. ఇటు రాష్ట్రంలో ఉన్న విపక్షాలపై కూడా చంద్రబాబు నిప్పులు చెరిగారు. తెలుగు దేశం పార్టీ గత ఎన్నికల్లో బిజేపీ తో జతకట్టింది.. విభజన కష్టాలతో ఉన్న ఏపీకి న్యాయం చేస్తారని… తాము అన్ని విధాలా ఈ నాలుగేళ్లలో మిత్ర ధర్మాన్ని పాటించామని…. ధిల్లీ లో ఉన్న ప్రధాని మోడీ ను తాను ఏపీకి న్యాయం చేయమని.. విభజన హామీలు అమలు చేయమని 29 సార్లు కలిసాను… అయినా ప్రధాని మోడీ పట్టించుకోలేదు.. ఇక కేంద్రం ఏపీని మోసం చేస్తుందని గ్రహించిన తాము ఎన్డియే నుంచి బయటకు వచ్చి… కేంద్రంపై పోరాడుతున్నట్లు చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఇక ఎంపీలు పార్లమెంట్ లో ప్రత్యెక హోదా కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు.. టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి 126 మంది ఎంపీలు సహకరించడం అనేది చరిత్రలో గుర్తుండిపోయే అంశం అన్నారు..ఆంధ్రుల సత్తా చాటారని కొనియాడారు.
అంతేకాదు.. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ చాలా బాగా మాట్లాడేవారని… ఇప్పుడు బాట మారింది… మాట మారింది.. 75వేల కోట్ల రూపాయల నిధులు ఇంకా కేంద్రం నుంచి రావాలని నిజ నిర్ధారణ కమిటీ చెబితే పవన్‌ ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. వైసీపీ కేసుల కోసమే కేంద్రంతో కుమ్మక్కైందని ఆరోపించారు..కేంద్రానికి జనసేన, వైసీపీ సహకరిస్తూ.. రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు.
రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తుంటే కుట్ర రాజకీయాలతో దెబ్బతీయాలని కేంద్రం చూస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. కౌరవలతో జరిగిన కురక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం సాధించారని.. అలాగే కేంద్రంతో జరిగే కురుక్షేత్రంలో ఏపీ విజయం సాధిస్తుందన్నారు.. రాష్ట్రానికి అన్యాయం చేసేవారిని వదిలిపెట్టేది లేదన్నారు చంద్రబాబు..

అర్హులైన పేదలకు పక్కా గృహాలు కచ్చితంగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. నిరుద్యోగుల కోసం యువనేస్తం పేరుతో నిరుద్యోగ భృతిని అందించడమే కాకుండా వారికి 10 వేల ఉద్యోగాలు భర్తీచేసేందుకు ప్రణాళిక సిద్ధంచేశామని తెలిపారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు చంద్రన్న బీమా అండగా ఉంటుందని తెలిపారు…. చంద్రబాబు ప్రతి పక్ష పార్టీలు బిజేపీ కలిసి .. రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది అని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తూనే.. ప్రజలకు సంక్షేమ పథకాలు చేరేలా ప్రయత్నిస్తున్నారు. విడిపోయి అనేక కష్ట నష్టాలను ఎదుర్కొంటున్న ఏపీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తన వయసు మరచి చంద్రబాబు నాయుడు ఇష్టంగా ఎంతో కష్టపడుతున్నారు.

Comment here