Local news

సిబిఐని దిగజార్చిన ఘనత నరేంద్రమోదీదే: సీపీఐ నేత రామకృష్ణ

భారతదేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ కార్యాలయంలోనే అధికారుల అవినీతిపై విచారణ జరుగుతుండటం సిగ్గుచేటని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. మంగళవారం విజయవాడలోని దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిబిఐని దిగజార్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాఫెల్ కుంభకోణం, సిబిఐ అవినీతి ఇతర అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా రేపు అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నామన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఢిల్లీలో గంటసేపు సమావేశం పెడితే అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారమవుతుందని.. కానీ అది చేయకుండా, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలంటూ బీజేపీవి రాజకీయ డ్రామాలని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. నవంబర్ 1, 2వ తేదీల్లో అగ్రిగోల్డ్ బాధితుల దీక్షలు చేయనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు.

Comment here