కాలిఫోర్నియా అడవిలో ఆరని కార్చిచ్చు… తీవ్రంగా శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

అమెరికాలోని కాలిఫోర్నియా అటవీ ప్రాంతంలో అంటుకున్న మంటలు రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. గత వారం రోజులక్రితం వ్యాపించిన మంటలు వేలాది ఎకరాలను బుగ్గిపాలు చేస్తూ దావానలంగా వ్యాపిస్తున్నాయి.

మంటలను అదుపుచేసేందుకు అమెరికాలో అగ్నిమాపక సిబ్బందికి తోడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అగ్నిమాపక సిబ్బంది సైతం రంగంలోకి దిగారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురుమరణించారు. 15 వందల నివాసాలు బూడిదయ్యాయి. వందలాది వాహనాలు దగ్దమయ్యాయి. అధికారులు వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రికార్డుస్థాయిలో మంటలు వ్యాపించడంతో అధికారులు హెలికాప్టర్లు, విమానాలతో అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా విద్యుత్, రవాణ వ్యవస్థ స్థంభించిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here