దొంగ వ్యాపారం చేసేవారు ఏపీలో లేరు : సీఎం చంద్రబాబు

కేంద్రం సీబీఐపై విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చిందని, కేంద్రం అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. అమరావతిలో గురువారం కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ భయాలను సృష్టించేలా ఐటీ దాడులను చేయిస్తున్నారని, దొంగ వ్యాపారం చేసేవారు ఆంధ్రప్రదేశ్ లో లేరని చంద్రబాబు అన్నారు. ఐటీ అధికారులకు స్వాగతం చెప్పి… ఇక్కడ ఏం జరుగుతుందో వివరంగా చెబుతామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రం సీబీఐని భ్రష్టుపట్టించిందని, నిబంధనలను కాలరాసి నరేంద్రమోదీ అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకున్నారని చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. తప్పులు బయటపడతాయనే భయంతో సీబీఐ డెరైక్టర్ ను మార్చారని సీఎం చంద్రబాబు విమర్శించారు. చివరికి సీబీఐపై విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. కేంద్రం వ్యవస్థలన్నిటినీ దుర్వినియోగం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. సీబీఐలో జరుగుతున్న పరిణామాలు మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధులు ఇచ్చి మరీ వెనక్కు తీసుకుందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్నందున ఆ రాష్ట్రానికి నిధులు ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని.. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. పైగా ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకున్నారని, పోలవరం నిధులు కూడా ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు విమర్శించారు. స్మార్ట్ సిటీలవల్ల రాష్ట్రాని కంటే కేంద్రానికి ఎక్కువ ఆదాయం వస్తోందని, కేంద్రం పట్టణాల అభివృద్ధికి నిధులు అరకొరగానే ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here