కేరళలో రాష్ట్రపతి పర్యటనకు బాంబు బెదిరింపు

కేరళలో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ హాజరుకానున్న సెయింట్ థామస్ కళాశాలలో బాంబును పెట్టానని సోమవారం మధ్యాహ్నం ఓ అగంతకుడు పోలీసులకు ఫోన్ చేశాడు. కంట్రోల్ రూంకు వచ్చిన ఫోన్ కాల్ ను పరిశీలించిన కుడంకుళం పోలీసులు కాల్ వచ్చిన మొబైల్ నెంబర్ ఆధారంగా ఆ ఆగంతుకుడిని చిరక్కాల్ కు చెందిన భగవతి దేవాలయం పూజారి జయరామన్ గా గుర్తించారు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలయ పూజారి మద్యం సేవించి ఈ ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేరళలో మూడురోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి రామనాధ్ కొవింద్ కేరళ చేరుకున్న సంగతి విదితమే. మంగళవారం సెయింట్ థామస్ కళాశాల శతవసంతాల సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం గురువాయూర్లోని శ్రీకృష్ణ దేవాలయం, మమ్మియార్ దేవాలయాన్ని సందర్శించనున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here