National

దాదాపు 103 నిమిషాల పాటు ఆకాశం లో అద్భుతం

ఆకాశంలో అత్యద్భుతం ఆవిష్కృతమైంది. ఈ శతాబ్దంలోనే సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేసింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత అరుణగ్రహం భూమికి అతి చేరువగా వచ్చిన అరుదైన మనోహర దృశ్యం… యావత్‌ ప్రపంచానికి మర్చిపోలేని అనుభూతి మిగిల్చింది. సుదీర్ఘ సమయం అంటే… దాదాపు 103 నిమిషాల పాటు కొనసాగిన చంద్రగ్రహాణాన్ని తిలకించి జనం ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఈ సంపూర్ణ చంద్రగ్రహణం.. సరిగ్గా రాత్రి 11.44 గంటలకు మొదలై అర్ధరాత్రి ఒంటి గంటకు సంపూర్ణ దశకు చేరుకుంది. అనంతరం క్రమంగా చంద్రుడు బయటకు రావడంతో రెండో దశ మొదలైంది. మరోవైపు ఈ అద్భుత చంద్రగ్రహణం అనుభూతిని రెట్టింపు చేసేందుకు అరుణ గ్రహం కూడా జోడీ కట్టింది. దీంతో సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం, అరుణవర్ణ చంద్రుడితో పాటు అంగారక దర్శనానికి వినీలాకాశం వేదికైంది.

Comment here