మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు,బిజేపి కార్యదర్శి రామ్ కుమార్ రెడ్డి బీజేపీకి షాక్ ఇచ్చారు. ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా రామ్ కుమార్ రెడ్డిని నిన్ననే కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ నియామకం జరిగి 24 గంటలు తిరక్కుండానే వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. ఈ రోజు పిఠాపురంలో పాదయాత్ర చేస్తున్న జగన్ ని కలిశారు. 2014లో కాంగ్రెస్ తరపున వెంకటగిరిలో పోటీ చేసి ఓడిపోయారు. ఆతర్వాత వెంకయ్యనాయుడుకి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు.2019లో మళ్లీ వెంకటగిరి నుంచే పోటీ చేయాలని భావిస్తూవచ్చారు. కానీ బీజేపీ, టీడీపీ లు వేరుపడటంతో ఆయన అసహనానికి గురయ్యారు. టిడిపి వైపు కూడా వెళ్లాలనే ఆలోచన చేశారు.ఈ నేపథ్యంలో ఆయనకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పదవిని ఇచ్చింది.కానీ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉండడంతో చివరకు ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపారు. వెంకటగిరి టికెట్ పై క్లారిటీ లేకున్నా బేషరతుగా వైసీపీ లో చేరుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆ టికెట్ ఆనం రామనారాయణ రెడ్డి అడుగుతున్నారు. ఎవరికి టికెట్ ఇవ్వాలనేది తర్వాత జగన్ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
బీజేపీకి షాక్ ఇచ్చిన బీజేపీ కార్యదర్శి నేదురుమల్లి

Related tags :
Comment here