Gossips

కిరీటి చేసిన అతే.. కౌశల్ ను స్ట్రాంగ్ చేసిందా…!!

బిగ్ బాస్ సీజన్ వన్ తో సీజన్ 2 ని పోల్చడం సహజం… మొదటి సీజన్ లో పార్టిసిపెంట్స్ హోస్టింగ్ చేసిన ఎన్టీఆర్ ను సెకండ్ సీజన్ లో హౌస్ లో అడుగు పెట్టిన పార్టిసిపెంట్స్ తో పాటు.. తొలిసారిగా హోస్ట్ గా అడుగు పెట్టిన నానిని పోల్చి మోడట్లో కొంత మంది పెదవి విరిచారు.. శ్రీ రెడ్డి వంటి వారు ఐతే.. ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు.. దీంతో సెకండ్ సీజన్ అనేక సందేహాల మధ్య మొదలైంది. నాని హోస్టింగ్ తో రెండో వారానికే ఓ రేంజ్ కు తీసుకొని వెళ్ళాడు. ఎన్టీఆర్ తో పొలికి పెట్టకుండా తనకంటూ ఓ ఐడెంటిని తెచ్చుకున్నాడు.. నాని ఫన్, సీరియస్ తో బిగ్ బాస్ ని నడిపిస్తున్నాడు. హౌస్ లో పార్టిసిపెంట్స్ కూడా బాగా చేస్తున్నారు. సామాన్యుడిగా వచ్చిన నూతన్ నాయుడు కూడా తానేమిటో నిరూపించుకున్నాడు. హౌస్ లో రెండు వారాలే ఉన్నప్పటికీ నూతన్ తానేమిటో చూపించాడు. కౌశల్ విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కాకముందు ఒక టివి యాక్టర్, మోడల్, యాడ్ ఏజన్సీ ఉన్న వ్యక్తి.. బయట కూడా పెద్దగా ఫాలోయింగ్ లేదు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన అందరికంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా కౌశల్ మారాడు.. ముఖ్యంగా బిగ్ బాస్ రెండో వారం నుంచి హౌస్ మేట్స్ టార్గెట్ గా కౌశల్ మారినప్పటి నుంచి కౌశల్ మీద ఆసక్తి పెరిగింది. ఇక కెప్టెన్ టాస్క్ లో కట్టేసి ఉన్న కౌశల్ కంటిలో కిరీటి దామరాజు నిమ్మరసం పోయటానికి ప్రయత్నించటం, మాటలతో హింసించటం వంటివి ప్రేక్షకులు బాగా గమనించారు. ఇక ఆ వీకెండ్ లో నాని వచ్చి కిరీటికి క్లాస్ పీకే సమయంలో కౌశల్ మాట్లాడిన మాటలతో ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించాడు. మొదటి రోజు నుంచే నన్ను టార్గెట్ చేసి గ్రూప్ లు కట్టి మరీ నన్ను బయటకు పంపాలని ప్లాన్ చేసారు. ఒక టాస్క్ లో భాగంగా దీప్తి సునైనాను ఎత్తుకుంటే దాన్ని తప్పని అస్తమాను దాన్ని ప్రస్తావించి నన్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు.. అంటూ అప్పటివరకు హౌజ్ లో జరిగిన విషయాలను చెప్పి మరీ తన ఆవేదనను తెలిపాడు. ఇక అప్పటి నుంచి కౌశల్ అభిమానులు ఒకొక్కరు కలిసి కౌశల్ ఆర్మీ ఫామ్ చేసి సోషల్ మిడియా పవర్ ఏమిటో చూపిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కౌశల్ ఆర్మీ ఏర్పడటానికి కిరీటి దామరాజ్ కారణం అయ్యాడని చెప్పవచ్చు. కిరీటి చేసిన అతి వల్లే కౌశల్ ఆర్మీ ఏర్పడింది. బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ కి ఎవరు వ్యతిరేకంగా ఉన్నవారిని హౌస్ నుంచి పంపిచేస్తున్నారు కౌశల్ ఆర్మీ. ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్నవారికి వచ్చిన ఓట్లలో 11 కోట్లు కౌశల్ కి వచ్చాయంటే కౌశల్ ఆర్మీ పవర్ ఏమిటో అందరికి అర్ధం అయ్యి ఉంటుంది… బిగ్ బాస్ టైటిల్ ప్రకారం ఎదైనా జరగవచ్చు అనే నినాదం ఇప్పుడు జరగబోతుందని అర్థం అవుతుంది. బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ స్ట్రాంగ్ పర్సన్ అవ్వడం తో కౌశల్ ఆర్మీ ఓట్ల రూపంలో నూతన్ కి సపోర్ట్ చేశారు. ఇప్పుడు కౌషల్ కి సపోర్ట్ చేసే వ్యక్తుల్లో నూతన్ మొదటిగా ఉంటాడు. ఇక ఎన్ని సార్లూ కౌశల్ ని నామినేట్ చేసిన కౌశల్ ఆర్మీ సేఫ్ చేస్తూనే వుంటారు. బిగ్ బాస్ హౌస్ లో మిగతా ఇంటి సభ్యులను కూడా స్ట్రాంగ్ గా చేసి కౌశల్ ఓటింగ్ లెక్కని మార్చేందుకు మరి ఏమైనా జరగవచ్చేమో చూడాలి మరి..

Comment here