బిగ్ బాస్ షో : కౌశల్ వెర్సస్ గీతామాధురి..

బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 2 చివరి స్టేజ్ కు చేరుకుంది. దీంతో షో మంచి రసవత్తరంగా మారింది.. ఇప్పటి వరకూ కౌశల్ నడవడికతో వన్ మ్యాన్ ఆర్మీలా సాగిన ఈ షో… లో కౌశల్ కే కిరీటం అని అందరూ భావిస్తున్న సమయంలో హోస్ట్ నాని ఫిట్టింగ్ పెట్టి.. కౌశల్ ను టార్గెట్ చేస్తూ.. సరికొత్త గేమ్ ప్లాన్ చేశారు. ఈ గేమ్ తో కౌశల్ ఇకనుంచి జరిగే ఎపిసోడ్స్ లో ఎలిమినేషన్ జోన్ లో ఉండేలా ఈ గేమ్ ను ప్లాన్ చేశారు.. దీంతో ఇక నుంచి కౌశల్ వెర్సస్… గీత మధురిగా మిగిలిన సీజన్ నడవనున్నది అని తెలుస్తోంది. మర్డర్ మిస్టరీ టాస్క్ లో భాగంగా సింగర్ గీతామాధురి తనకు ఇచ్చిన టాస్కులను సక్సెస్ ఫుల్ పూర్తీ చేసి…. హంత‌కురాలిగా ఉన్న త‌న‌ని పోలీసాఫీస‌ర్‌గా ఉన్న రోల్ రైడా, డిటెక్టివ్‌గా ఉన్న గణేష్‌లు గుర్తుప‌ట్ట‌కుండా ప్ర‌వ‌ర్తించాలి. వీటిలో విజ‌యం సాధిస్తే గీతా ఈ వారం నామినేష‌న్ నుండి బ‌య‌ట‌పడుతుందని నాని చెప్పడమే కాదు.. గీత కు మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు… అదే తనకు ఇష్టమైన వ్యక్తిని సీజన్ మొత్తం నామినేట్ చేసే అవకాశం..
దీంతో గీతా మాధురి ఓ రేంజ్‌లో ఇన్వెస్టిగేష‌న్ చేసిన రోల్ రైడా, గ‌ణేష్‌లు చివ‌రికి హంతకుడు తనీష్ అని చెప్పింది. . ఇక నాని సీక్రెట్ టాస్క్‌ల‌ని స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి చేసిన గీతా మాధురికి ఈ వారం నామినేష‌న్ నుండి గీతాకి మిన‌హాయింపు ఇచ్చారు. ఇక సీజ‌న్ మొత్తం ఎవ‌రిని నామినేట్ చేస్తారని బిగ్ బాస్ గీతాని ప్ర‌శ్నించ‌గా, అందుకు మ‌రోమారు ఆలోచించ‌కుండా కౌశ‌ల్ పేరు చెప్పింది.
అనతరం తాను కౌశల్ ను ఎలిమినేషన్ జోన్ లో నామినేట్ చేసేందుకు చాలా కారణాలున్నాయని చెప్పింది. కౌశల్ తో గీత మాట్లాడుతూ.. మీరే గేమ్‌ని గేమ్‌లా ఆడ‌మంటారు క‌దా అని కాస్త వెట‌కారంగా కూడా వ్యాఖ్య‌లు చేసింది. ఆ త‌ర్వాత మీకు కౌశల్ ఆర్మీ ఉందిగా అంటూ గీతా మాధురి వ్యగ్యంగా మాట్లాడటంతో కొంత భావోద్వేగానికి గుర‌య్యాడు కౌశ‌ల్‌. ఆ స‌మ‌యంలో నూత‌న్ నాయుడు కౌశల్ ద‌గ్గ‌ర‌కి వ‌చ్చి ధైర్యాన్ని అందించాడు. నీకు నేను అండ‌గా ఉంటానంటూ బ‌రోసా ఇచ్చాడు.

ఇక బిగ్ బాస్ లో కౌశల్, గీతమాధురి, నూతన్ నాయుడు, గణేష్, అమిత్, తనీష్, శ్యామల, దీప్తి నలమోతు, సామ్రాట్, రోల్ రైడర్ లు ఉన్నారు.. వీరిలో ఇద్దరు ఈ వీక్ లో ఎలిమినేట్ అవుతారు. దీంతో మళ్ళీ 8 మంది బిగ్ బాస్ హౌస్ లో మిగులుతారు. అనంతరం మరో ఇద్దరిని ఎలిమినేట్ చేసి.. ఫైనల్ ఎపిసోడ్ లో 6 ఆరుగురు తో ఆడించేలా బిగ్ బాస్ హౌస్ నిర్వాకులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఈ సీజన్ లో కౌశల్ కు పోటీగా గీతా మధురి ఉంది. దీంతో ఈ సీజన్ లో కౌశల్ కానీ గీతా మధురి కానీ అయ్యే అకాశాలున్నాయని ప్రేక్షకుల టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here