తనీష్ చేసిన పనే కౌశల్ చేసి ఉంటే…!!

బిగ్ బాస్ సీజన్ 2 మొదలై.. సగం రోజులు పూర్తీ చేసుకున్నది.. రోజు రోజుకీ ఆసక్తి కరంగా మారుతున్న ఈ బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం కెప్టెన్సీ కోసం జరిగిన టాస్క్ లో తనీష్, దీప్తి లు పోటీ పడ్డారు. అయితే ఈ పోటీలో విజేత ఎవరనేది పక్కకు పెడితే… పెట్టిన గేమ్ తో పాటు.. ఆడుతున్న సమయంలో జరిగిన సంఘటనలపై కూడా సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. గేమ్ ఆడుతున్నప్పుడు తనీష్… దీప్తి నల్లమోతు ని ఫిజికల్ గా అడ్డుకున్నాడు… ఆమె గోడకు రంగు వేయకుండా తన బలం అంతా ఉపయోగించి నివారించాడు.. ఇంకా చెప్పాలంటే.. దీప్తి విజేత కాకుండా ఉండడానికి ఆమె తనీష్ తన బలంతో బంధించాడు.. దీంతో ఎంత కష్టపడ్డా తనీష్ బలం ముందు నిలబడలేదు.. తనీష్ బారి నుంచి విడిపించుకోలేక పోయింది. ఈ టాస్క్ లో దీప్తి సునయన తనీష్ ను విన్నర్ గా ప్రకటించింది. అయితే తనీష్ ఎన్నుకున్న గోడ కలర్ రెడ్… దీంతో ఆ కలర్ డామినేట్ చేసింది.. ఆ విషయం కూడా పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కౌశల్ చెప్పినా.. దీప్తి సునయన ఆ విషయం పట్టించుకోలేదు.. తనీష్ ను ఎంపిక చేసింది. అనంతరం మగాళ్లతో ఆడవాళ్లకు ఫిజికల్ గేమ్ లు పెట్టడం ఏంటని దీప్తి కాస్త ఎమోషనల్ అయింది. వెంటనే తనను తాను సముదాయించుకొని నార్మల్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తనీష్ చేసిన పని పై కామెంట్స్ చేస్తున్నారు.. ముఖ్యంగా కౌశల్ అభిమానులు తనీష్ చేసిన పనిపై స్పందిస్తూ…

తనీష్ చేసిన పనే కౌశల్ చేసి ఉంటే హౌస్ మొత్తం ఏకమయ్యి కౌశల్ ని టార్గెట్ చేసి మరింత దూషించేవారని అంటున్నారు. అంతేకాదు.. ఆడవాళ్ల విషయంలో [మగవారు చేసే ఆగడాలు అంటూ నిరంతరం స్పీచ్ లు ఇచ్చే బాబు గోగినేని ఇప్పుడు తనీష్ విషయంలో ఎందుకు మాట్లాడలేదు, ఆయన శిష్యుడు కనుక వదిలేశారా..? అంటూ అంటూనే… తనీష్ ప్లేస్ లో కౌశల్ ఉండి ఉంటే పెద్ద సీన్ చేసి స్పీచ్ ఇచ్చి ఉండేవారు అంటూ ఉండేవారంటూ మండిపడుతున్నారు. నిజమేమరి కౌశల్ గనుక దీప్తిని ఫిజికల్ గా అడ్డుకొని ఉండి ఉంటే హౌస్ మొత్తం ఏకమయ్యి పరిస్థితిని మరో విధంగా తీసుకొచ్చే వారు అని బిగ్ బాస్ ప్రేక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here