శయనభంగిమలో హనుమాన్ విగ్రహం..

రామభక్త హనుమాన్ కి జై అంటూ భక్తులు హనుమంతుడిని పూజిస్తారు. అయితే దేశంలో ఎక్కడ ఏ ప్లేస్ లో హనుమాన్ దేవాలయాన్ని చూసినా విగ్రహం నిలబడి ఉంటుంది. కానీ ఇప్పటి వరకూ శయన భంగిమలో ఉన్న హనుమంతుడిని ఇప్పటి వరకూ చూసి ఉండి ఉండరు. ప్రస్తుతం శయన భంగిమ హనుమాన్ విగ్రహం ఫోటో ఒకటి సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది.

ఆంజనేయుడు ఒక ప్రక్కకు వాలి… పైకి చూస్తూ విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఉన్న ఆ విగ్రహం ఆంజనేయ భక్తులను విపరీతంగా ఆకర్షిస్తోంది. అయితే హనుమంతుడు శయనభంగిమలో ఉన్న విగ్రహం ఔరంగాబాద్ లోని కుల్దబాద్ లో భద్ర మారుతీ ఆలయంలో ఉంది. హనుమంతుడు విశ్రాంతి తీసుకుంటున్న విగ్రహం ఉన్న ఏకైక దేవాలయం ఇదే కనుక భక్తులు రద్దీ ఎక్కువుగానే ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here