చంద్రబాబు తో బాలయ్య, క్రిష్, రానా భేటీ…

ముఖ్యమంత్రి చంద్రబాబు తో ఎమ్మెల్యే బాలకృష్ణ, ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్, దగ్గుబాటి రానా భేటీ అయ్యారు. ఈ భేటిలో ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సానుకూలమైన వాతావరణం ఉందని .. దీనికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఇస్తామని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు అందమైన సహజ వనరులు, ఆకర్షణీయ సుందర దృశ్యాలతో కూడిన అనేక ప్రదేశాలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు.
కొత్త రాజధాని అమరావతి తో పాటు అనేక ప్రదేశాలు ఎంతో ఆకట్టుకుంటాయని ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు..చెప్పారు,,, అందుకు తగ్గట్టుగా సినీ పరిశ్రమ అభివృద్ధి చెంది నిలదొక్కుకోడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని సినీ దర్శకులు క్రిష్, హీరో రానా సిఎంతో అన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ఉపాధి అవకాశాలు కూడా చాలా వస్తాయని తెలిపిన ముఖ్యమంత్రి ఉన్నత ప్రమాణాలతో ఫిల్మ్ అండ్ టీవీ ఇనిస్టిట్యూట్ నెలకొల్పడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి హమీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here