Cinema

మా నాన్నగారితో కరుణానిధి విశేషమైన అనుబంధం ఉంది : బాలకృష్ణ

సీనియర్ నేత కరుణానిధి మృతిపై ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ స్పందిస్తూ.. భారతావని ఓ అత్యుత్తమ రాజకీయ నేతను కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ… ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు..
“రాజకీయ నాయకులు కరుణానిధి మరణం రాజకీయాలకు మాత్రమే కాదు, చిత్రసీమకు కూడా తీరని లోటు. నాన్నగారితో ఆయనకు విశేషమైన అనుబంధం ఉండేది. 80 ఏళ్ల రాజకీయ అనుభవం, 5 సార్లు ముఖ్యమంత్రిగా, 13 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది మాములు విషయం కాదు. అటువంటి రాజకీయ చరిత్ర కలిగిన మహానుభావుడు, నేడు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన లోటు తీర్చలేనిది, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని బాలకృష్ణ కరుణానిధి తో తన తండ్రికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు.

Comment here